Home » Bonalu Song 2023 Lyrics – Mangli

Bonalu Song 2023 Lyrics – Mangli

by Msonglyrics

Bonalu Song 2023 Lyrics Telangana folk song by Mangli. Music composed by Sk Baji and sung by Mangli. Bonalu 2023 lyrics penned by Madeen SK

Bonalu Song 2023 Details

SongBonalu Song 2023
Artist/SingerMangli
DirectionDamu Reddy
MusicSK Baji
LyricsMadeen SK
Label Mangli Official

Bonalu Song 2023 Lyrics

జోడు డప్పుల్ మోగే జోరు సప్పుళ్
ఏంట యాట పిల్లల్ నాటు కోడిపుంజుల్
నీ తానకు బైలెల్లినమే మైసమ్మ
తల్లి పిల్లజెల్ల కదిలినమే ఎల్లమ్మ

పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్
కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్
పాయసాలు తెచ్చినమే పోశమ్మ నిన్ను
పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ

నెత్తి సుట్టబట్ట సూసి మురిసేనంట
సుట్టూర శివాలూగే సంబరాలు కంట
కుంకుమ అద్దె నంట గోలుకొండ కోట
గజ్జెగట్టి దరువులేసి ఆడే బల్కంపేట

తడిబట్టల తానాల్ నియమాల బోనాల్
జగదంబకు జేజమ్మ నిండు ఒక్క పొద్దుల్
సూడుగొడ్డు గొదల్ పల్లే పాడి పంటల్
ఏటేటా ముట్టాజెప్పుకుంటామే ముడుపుల్

అషాఢ మాసాల్ అంతురాల బోనాల్
ఆరగించగా రావే బెల్లం నైవేద్యాల్
తాటి కొమ్మ ర్యాకల్ మేటి కల్లు శాకల్
మెచ్చినట్టు తెచ్చినాము తీరు ఫలహారాల్

ఉజ్జయినీ మహంకాళి ఓరుగల్లు భద్రకాళి
రావె…రావె…రావె… తల్లీ…

నిమ్మకాయ దండల్ యాపాకు మండల్
మాలగట్టి తెచ్చినము తొలగించు గండాల్
వెండి గండ దీపాల్ కరిగించే పాపాల్
కాళికా కరుణగల్ల నీ సల్లని సూపుల్

ఈరగోల దెబ్బల్ పెట్టె పెడ బొబ్బల్
మహిమల్ల మహంకాళికి మత్త గొలుపుల్
గుడిసుట్టు మేకల్ పెట్టే గావు కేకల్
కూతవెట్టి పోతరాజు ఆడే వీరంగాల్

ఇంద్రాకీలాద్రి కనక దుర్గ
మమ్మెలు కొనగ రావె… రావె
రావె.. రావే… తల్లీ

కూడినము సుట్టాల్ మరిశినము కష్టాల్
జగమేలె తల్లికి పెట్టంగ పట్టు బట్టల్
కట్టినాము తొట్టెల్ జడితిచ్చే పొట్టెల్
గావురాల దేవికి తొడగంగ పైడి మెట్టెల్

లాలూ దర్వాజల్ అలీజా నయాపూల్
షాలిబండ గౌలీపుర దేవి దర్బారుల్
పోటెత్తె భక్తుల్ ఎల్ల అదివారాల్
రంగమునాడినిపించు నీ మనసుల మాటల్

మీరాలంమండి దండి కాసరట్ట మహాంకాళీ
రారా… రారా…రారా… తల్లీ..

Bonalu Song 2023 Music Video

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

msonglyrics logo

Msonglyrics is your ultimate source for the latest and most popular song lyrics from Telugu, Hindi, English, Devotional, and much more